ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్స్ లిస్టులో వెన్నెలకిషోర్ పేరు ముందు వరుసలో ఉంది. ఆదివారం రాత్రి జరిగిన సంతోషం 17వ సౌతిండియా అవార్డ్స్‌లో వెన్నెలకిషోర్‌కి సీనియర్ కమెడియన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య స్మార్మక అవార్డ్ దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన వెన్నెలకిషోర్ ఈ అవార్డుని ఇచ్చిన జ్యూరీ సభ్యులకు, సంతోషం సురేశ్‌కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు వచ్చిన ఈ అవార్డుని రీసెంట్‌గా అనారోగ్యంతో కన్నుమూసిన కమెడియన్ వేణుమాధవ్‌కి అంకితమిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa