హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన 'మా' సినిమా ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. తల్లీ కూతుళ్ల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో, భర్త మరణం తర్వాత అంబిక తన చిన్న కుమార్తె శ్వేతతో కలిసి పూర్వీకుల గ్రామానికి వెళ్తుంది. అక్కడ ఒక అదృశ్య శక్తి అమ్మాయిలను వేధిస్తుందని, తన కూతురు కూడా ఆ రాక్షసుడికి లొంగిపోతుందని తెలుసుకుంటుంది. తన కుమార్తెను, ఇతర అమ్మాయిలను రక్షించడానికి తల్లి చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ఆగస్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa