విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయతో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అనూహ్యమైన కాంబినేషన్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి' వంటి క్లాస్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న వివేక్ ఆత్రేయ, ఈసారి తన పంథాకు భిన్నంగా బాలయ్య మాస్ ఇమేజ్‌కు సరిపోయే భారీ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ స్పాన్ చాలా పెద్దదిగా ఉండటంతో దీనిని ఒకే సినిమాగా కాకుండా రెండు భాగాలుగా తెరకెక్కించాలా? అనే విషయంపై దర్శకనిర్మాతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని టాక్ వినిపిస్తోంది. మాస్ హీరోను క్లాస్ చిత్రాల దర్శకుడు ఎలా ప్రెజెంట్ చేస్తాడనే కుతూహలం అభిమానుల్లో, సినీ వర్గాల్లో నెలకొంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa