ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్‌లో కొత్త రొమాన్స్.. దేవి ప్రసాద్‌తో ఫ్రెష్ లవ్ స్టోరీ స్టార్ట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 09:37 PM

దర్శకుడిగా ‘బ్లేడ్ బాబ్జి’, ‘కెవ్వు కేక’, ‘మిస్టర్ పెళ్లికొడుకు’ వంటి వినోదాత్మక చిత్రాలతో Devi Prasad మంచి గుర్తింపు పొందారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించడంతో ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది.ఇప్పుడు ఆయన నటుడిగా కూడా బిజీ అవుతున్నారు. ‘నీది నాదీ ఒకే కథ’ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో యాక్టింగ్‌పై దృష్టి సారించారు. తాజాగా ఆయన ఓ కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.కొత్త లవ్ డ్రామాకు శ్రీకారం ఈ చిత్రంలో దేవి ప్రసాద్ కీలక పాత్ర పోషించనున్నారు. జగన్ యోగి రాజ్, నవ్య చిట్యాల జంటగా నటిస్తున్నారు. హన్సి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ సినిమాతో హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.చిత్ర నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ, “సినిమాపై నాకు ఎంతో అభిరుచి ఉంది. అందుకే నిర్మాణ రంగంలో అడుగుపెట్టాను. మా బ్యానర్‌లో తొలి చిత్రంగా అందమైన లవ్ ఎంటర్‌టైన్‌ర్‌ను ప్రారంభించాం. ఇందులో ప్రేమ, భావోద్వేగాలు, వినోదం సమపాళ్లలో ఉంటాయి” అని తెలిపారు.దర్శకుడు రఘువర్ధన్ కోట్ల మాట్లాడుతూ, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా తవిటిరాజు తలచింతల వ్యవహరిస్తుండగా, ఛాయాగ్రహణం సాయి వంశీ దాచపల్లి, ఎడిటింగ్ ఉదయకిరణ్ ఏవీ, సంగీతం రాజీవ్ రాజ్, కళా దర్శకత్వం శ్రీపాల్ మాచర్ల అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa