ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్ 'పెద్ది' డబ్బింగ్ పనులు ప్రారంభం

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 09:14 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది'కి సంబంధించి కీలక అప్డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డబ్బింగ్ పనులను రామ్ చరణ్ తాజాగా ప్రారంభించారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ నటిస్తున్న సోలో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.డబ్బింగ్ ప్రారంభించిన విషయాన్ని రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. డబ్బింగ్ స్టూడియోలో దర్శకుడు బుచ్చిబాబుతో సరదాగా గడుపుతున్న 'బిహైండ్ ది సీన్స్'  వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఈ వీడియోలో దర్శకుడిని రామ్ చరణ్ ఆటపట్టిస్తూ, నవ్విస్తూ కనిపించారు.పెద్ది డబ్బింగ్ స్టార్ట్స్ వాట్ ఈజ్ ఇట్" అంటూ చరణ్ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవలే ఫిబ్రవరి 15న బుచ్చిబాబు పుట్టినరోజు సందర్భంగా చరణ్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. బుచ్చిబాబు ప్యాషన్, కథలోని అంశాలను డీల్ చేసే విధానం తనకు ప్రతిరోజూ స్ఫూర్తినిస్తోందని చరణ్ పేర్కొన్నారు. తాజా వీడియోలో వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం మరోసారి స్పష్టమైంది.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa