సైరా మూవీకి ఎంతో కీలకమైన ఏపీలో సినిమా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడం చాలామందికి ఆశ్చర్యం కలిగింది. అయితే సినిమా విడుదలకు కొద్ది గంటల ముందే ఈ రకమైన అనుమతులు రావడం విశేషం.
వివరాల్లోకి వెళ్తే.. కొద్దిగంటల క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నయా మూవీ సైరాకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. ఖైదీ నంబర్ 150 తరువాత గ్యాప్ తీసుకుని సైరా సబ్జెక్ట్‌ను ఎంచుకున్న చిరంజీవి... సినిమాకు వందశాతం న్యాయం చేశాడని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా... సైరా మూవీకి ఎంతో కీలకమైన ఏపీలో సినిమా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడం చాలామందికి ఆశ్చర్యం కలిగింది. అయితే సినిమా విడుదలకు కొద్ది గంటల ముందే ఈ రకమైన అనుమతులు రావడం విశేషం. మంగళవారం మధ్యాహ్నం దాక స్పెషల్ షోలకి అనుమతులు రాకపోవటంతో సినిమా స్పెషల్ షోలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి.
అయితే సైరా మూవీ స్పెషల్ షోలకు అనుమతించాలని పలువురు సినీ పెద్దలు వైసీపీ ముఖ్యనేతల ద్వారా సీఎం జగన్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారని సమాచారం. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, పీఆర్పీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఉన్న కన్నబాబు రంగంలోకి దిగి సైరాకు ఈ విషయంలో సాయం చేశారని తెలుస్తోంది. సైరా స్పెషల్ షోస్ అనుమతి రావటం వెనుక కీలక పాత్ర పోషించింది మంత్రి కన్నబాబే అని... ఈ విషయంలో సీఎం జగన్‌ను ఆయనే ఒప్పించారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా... సైరా సినిమాకు సంబంధించి ఏపీలో స్పెషల్ షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa