ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దర్శకత్వం చేయాలని ఉంది: ప్రియాంక

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2019, 02:16 PM

ప్రియాంక చోప్రా అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిన పేరు. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. ఇంక హాలీవుడ్ లో అయితే అటు సినిమాలతో పాటు ఇటు టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఆమె ఒక్క నటిగానే కాకుండా సింగర్ గా ప్రొడ్యూసర్ గా కూడా పేరు తెచ్చుకుంది. అమెరికా సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని అమెరికాలోనే ఉంటుంది ప్రియాంక. ఇప్పుడు ఈ బ్యూటీ మనసు దర్శకత్వం వైపు లాగుతుంది. కాకపోతే డైరెక్షన్ అనేది చాలా బాధ్యతతో కూడిన పని అని అందుకే మెగా ఫోన్ పెట్టుకోవాలంటే కొంచెం టెన్షన్ గా ఉందని అంటుంది. అయితే తాను ఇండస్ట్రీకి వచ్చినపుడు తన దృష్టి అంతా కేవలం నటన మీదే ఉంచానని తర్వాత నిర్మాతగా కూడా మారానని అలాగే ఎప్పటికైనా దర్శకత్వం చేయాలని ఉందని ఆమె తన కోరిక బయటపెట్టింది. ఏ సపోర్ట్ లేకుండా కస్టపడి పైకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక తలచుకుంటే దర్శకత్వం చేయడం ఆమెకు అంత కష్టం కాకపోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa