ఇటీవల ప్రముఖ వోక్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై నయన్ నిలిచింది. సౌత్ హీరోయిన్స్ ఎవరికి దక్కని అరుదైన గౌరవం నయన్ కు మాత్రమే దక్కింది. బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే ఇప్పటి వరకు వోక్ కవర్ పై కనిపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ కవర్ పై నయన్ తన అందచందాలను ప్రదర్శించింది. వోక్ కోసం హాట్ ఫొటో షూట్ తో పాటు ఇంటర్వ్యూ కూడా నయన్ ఇచ్చింది. పదేళ్ల తర్వాత నయన్ ఇంటర్వ్యూ ఇవ్వడంతో తమిళ మరియు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో నయన్ ఏం చెప్పిందా అంటూ అంతా ఆసక్తిని కనబర్చుతున్నారు.
ఆ ఇంటర్వ్యూలో నయన్ చెప్పిన కొన్ని ముఖ్య విషయాలను చూసినట్లయితే.. కెరీర్ ఆరంభంలో ఒకటికి రెండు సార్లు నేను మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరించింది. నేను ఆ సందర్బంలో చాలా బాధపడ్డాను. అందుకే అప్పటి నుండి అంటే 10 ఏళ్లుగా నేను ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వడం కాని.. బైట్స్ ఇవ్వడం కాని చేయడం లేదంది. సినిమాల్లో నటించడమే నా పనిగా పెట్టుకున్నాను. అంతకు మించి నేనేం చేయను. నటించడం అనేది సక్రమంగా చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కష్టపడతాను.
షూటింగ్స్.. కాస్ట్యూమ్స్.. మేకప్ ఇలా అన్ని విషయాల్లో కూడా నేనే నిర్ణయం తీసుకుంటాను. కథకు ఎంత వరకు అవసరమో అంత వరకు నేను సిద్దం అవుతాను. సినిమా పూర్తిగా మగాళ్ల గుప్పిట్లో ఉన్నా కూడా నేను మాత్రం సర్దుకు పోలేదు. నా ఇష్టానికే కథలు ఎంపిక చేసుకున్నాను
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa