ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సరీలేరు నీకేవరు' దసరా పోస్టర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2019, 05:11 PM

'సరీలేరు నీకేవరు' దసరా పోస్టర్.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాకు సంబంధించిన మాస్ లుక్ పోస్టర్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  మహేష్ బాబు కొండారెడ్డి బురుజు దగ్గర గొడ్డలి పట్టుకొని నిలబడే లుక్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. మాస్ ను ఆకట్టుకోవడానికి పోస్టర్ ను డిజైన్ చేసినట్టు ఉంది.  పక్కా ఎంటర్టైనర్ అయినప్పటికీ మాస్ కు నచ్చే అన్నిరకాల మసాలాలు ఉంటాయని చెప్పేందుకే ఈ లుక్ ను డిజైన్ చేసి ఉండొచ్చు.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్నది.  విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు.  వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఎలా ఉంటుంది అనే విషయం తెలియాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa