ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2019, 11:56 PM

ఉస్మానియాలో ఉద్యమాల వైపు ఆకర్షితుడైన జార్జ్ రెడ్డి   భారతీయ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) విద్యార్థి విభాగం అనుబంధ సంస్థ. అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పీడీఎస్యు)ను స్థాపించి, 25 ఏళ్ల వయసులో, ఉస్మానియా ఆవరణలో 30 మంది మూకుమ్మడిగా కత్తులతో చేసిన దాడిలో   హత్యగావించ‌బ‌డ్డాడు . సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన గురించి తెలుసు. చ‌రిత్ర మరచిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన చలన చిత్రం- జార్జి రెడ్డి. ఆ నేత గురించి ఈ తరం తెలుసుకునేందుకు రూపొందించిన జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ మంగళవారం విడుదలైంది. సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్ తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. వంగ వీటి మూవీతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి పాత్రలో ఇమిడి పోయారు. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa