ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంత మంచి వాడవురా టీజర్ రిలీజ్‌-అద‌ర‌గొడుతున్నకళ్యాణ్ రామ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2019, 10:05 PM

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ఎంత మంచి వాడవురా చిత్రం టీజర్ విడుదల అయింది.  ఎంత మంచి వాడవురా అనే టైటిల్ ఎందుకు పెట్టారోమరింత ఆసక్తి రేపేలా ఈ టీజ‌ర్ ఉంది. శతమానం భవతి సినిమాతో ఫ్యామిటీ ఆడియన్స్ ను మెప్పించిన సతీష్ ఈ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వస్తాడని అనుకుంటున్నారు. తన స్టైల్ లోనే ప్రేక్షకులను మెప్పించేందుకు సతీష్ ఈ సారి డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కళ్యాణ్ రామ్ సరికొత్త ఎమోషనల్ ఫ్యామిటీ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు.   అందాల నాయిక మెహరీన్ హీరోయిన్ గా ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నటిస్తుండ‌గా ఉమేష్ గుప్త నిర్మిస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించే ఈ చిత్రం ద్వారా ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు ప్రొడక్షన్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa