తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని 2024 ఎన్నికలే తన ప్రధాన లక్ష్యం అని పవన్ పదే పదే చెప్పకనే చెబుతున్నారు. సినిమాల వైపు రావాలన్న నిర్ణయాన్ని పవన్ ఎప్పుడూ ఏ వేదికపైనా ప్రకటించిందేం లేదు. అయితే సైరా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ కామెంట్ పవన్ తిరిగి సినిమాల్లోకి రాబోతున్నారన్న సంకేతాలు ఇచ్చింది. దాంతో మరోసారి దీనిపై ఆసక్తికర చర్చకు తెరలేపింది.
నా బిడ్డ రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు ఎంత ఆసక్తిగా ఉంటానో పవన్ కల్యాణ్‌తోనూ సినిమా చేసేందుకు అంతే ఆసక్తిగా ఉంటాను. నేను-పవన్ కలిసి నటిస్తామంటే రామ్ చరణ్ సిద్ధంగానే ఉన్నాడు.. అంటూ చిరు వ్యాఖ్యానించడంతో పవర్ స్టార్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్ రాజకీయాల్లో ఉన్నా సినిమాల్లోకి రావాల్సిందేనని చిరు పట్టుబడుతున్నారా? అందుకు పవన్ కూడా సై అనేశారా? అనే సందేహం తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు పవన్ అభిమానుల్లోనూ కనిపిస్తోంది.
మరోవైపు జనసేన వర్గాలు మాత్రం పవన్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న కథనాలు కొట్టి పారేస్తు, ఇవి కేవలం రూమర్ మాత్రమే అని చెపుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa