అర్జున్ రెడ్డి మూవీతో చాలా మంది అభిమానులను గెలుచుకున్న హీరో విజయ్ దేవరకొండ. ప్రేక్షకులను తన నుంచి ఇంకా బెటర్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వాలని తన సినిమాలను ఆచి తూచి ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘వరల్డ్ బెస్ట్ లవర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్.. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ అయిన వోగ్‌కు ఫొటో షూట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన ఓ బాలీవుడ్ హీరోయిన్ నెంబర్ కావాలని ఏకంగా ఓ డైరెక్టర్‌నే అడిగేశాడట.
ఆ నటి ఎవరో కాదు యంగ్ బ్యూటీ ఆలియా భట్. ఆలియాకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మెంటార్. ఈయన నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతోనే ఆలియా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. అందుకే ఆలియా నెంబర్ కావాలని విజయ్.. కరణ్ జోహార్‌ను అడిగాడట. ఈ విషయాన్ని కరణ్ వోగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘టైం కాని టైంలో నేను ఓసారి కరణ్ జోహార్‌కు ఫోన్ చేశాను. ఆలియా భట్ నెంబర్ కావాలని అడిగాను. మీరు మరోలా అనుకోకండి. ఆలియా నటించిన ‘గల్లీ బాయ్’ సినిమా చూశాక అందులో ఆమె నటన చాలా నచ్చింది. సినిమా చూశాక అసలు నాకు నిద్ర పట్టలేదు. అందుకే ఆలియాకు కంగ్రాట్స్ చెప్పాలని నెంబర్ అడిగాను’ అని అసలు విషయం చెప్పాడు విజయ్ దేవరకొండ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa