ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పదవి నాది కాదంటున్న శ్రీనివాస రెడ్డి...

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2019, 04:48 PM

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ శ్రీనివాసరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ డైరెక్టర్స్ లో ఒకరిగా నియమించబడ్డారంటూ ట్విట్టర్ లో వచ్చిన ఒక పోస్ట్ కి స్పందించారు. ఆ పదవికి ఎంపికైంది నేను కాదు దర్శకుడు శ్రీనివాస రెడ్డి అని స్పష్టత ఇచ్చారు. టీటీడీ కి చెందిన ఎస్వీబీసీ ఛానల్ డైరెక్టర్స్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్ట్ స్వప్న మరియు నాగార్జున హీరోగా ఢమరుకం చిత్రం తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస రెడ్డి లను నియమించింది. పేర్లు ఒకటే కావడంతో కొందరు ఆ పదవికి ఎంపికైంది హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి అని పొరపాటు పడటం జరిగింది. హిందూ మత ప్రచారానికి ఉద్దేశించిన ఈ ఛానల్ కి చైర్మన్ గా మరో హాస్యనటులు పృథ్వి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ మూవీ భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు షూటింగ్ జరుపుకుంటుంది. కమెడియన్ సత్య, షకలక శంకర్ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని శ్రీనివాస రెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈయన ఆనందో బ్రహ్మ, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాలలో హీరోగా చేయడం జరిగింది. అందుకే హడావుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సాధారణంగా అన్ని సినిమాలు శుక్రవారం విడుదలవుతుంటాయి. కానీ ఈ రెండు సినిమాలు కూడా ఆదివారం పోటాపోటీగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa