ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ బాబు రాకతో కిక్కిరిసిన విజయవాడ

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2019, 07:14 PM

ప్రిన్స్ మహేష్ నేడు విజయవాడలో సందడి చేశారు.ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన మహేష్ కొరకు ఫ్యాన్స్ పోటెత్తారు. దీనితో ఆ ప్రాంతం అంతా ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. బీమా జ్యుయలర్స్ షాప్ ఓపెనింగ్ కొరకు మహేష్ ని ప్రత్యేక అతిధిగా ఆహ్వానించడం జరిగింది. దీనితో సదరు యాజమాన్యం తమ నగల దుకాణం మహేష్ బాబు ఓపెన్ చేస్తున్నట్లుగా భారీగా ప్రచారం చేయడం జరిగింది. ఇది తెలుసుకున్న మహేష్ అభిమానులు ఉదయమే అక్కడకు చేరుకున్నారు. బ్యానర్స్, హోర్డింగ్స్ లాంటివి ఏర్పాటు చేయడంతో పాటు, మహేష్ ఫోటో ఉన్న ప్లకార్డులు పట్టుకొని తమ అభిమానాన్ని మహేష్ కి తెలియజేశారు.ఈ సందర్భంగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన మహేష్ తనపై అభిమానులు చూయిస్తున్న ఈ ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా మహేష్ ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ చిత్రీకరణ దశలో ఉండగా, సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రష్మీక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa