ధనుష్, మంజు జంటగా నటించిన అసురన్ సినిమా ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ధనుష్, మంజు నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.తాజాగా ఈ సినిమాను చూసిన కమలహాసన్, శ్రుతిహాసన్‌లు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాక, మంజును స్వయంగా ఇంటికి ఆహ్వానించి,. అద్భుతంగా నటించావంటూ ఆకాశానికెత్తేశారు. మరిన్ని తమిళ చిత్రాల్లో నటించాలని ఈ సందర్భంగా కమల్ కోరారు. అసురన్ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి మంజు వారియర్‌కు సూపర్ స్టార్ కమలహాసన్ నుంచి ప్రశంసలు అందుకోవటం పట్ల తెగ ఆనంద పడిపోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa