నవీన్ రాజ్ శంకరాపు, శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్నచిత్రం"వనవాసం". భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వం లో శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం: 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ “భారత్ కుమార్ .పి” మాట్లాడుతూ.. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ని తీయడం జరిగింది. ఈ ట్రైలర్ లాగానే సినిమా కూడా మీ అందరూ మెచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
నిర్మాత "సంజయ్ కుమార్. మాట్లాడుతూ.. సినిమా మేము అనుకున్న దానికంటే చాల అద్భుతంగా తెరకు ఏకించారు అక్టోబర్ 25న ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధం గా ఉన్నాం అని చెప్పారు.
హీరో నవీన్ రాజ్ శంకరాపు మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గారికి ఎపటికి రుణపడి ఉంటాన్ను ఇంకా మా కోసం కష్టపడిన మా టీం అందరి కోసం అయినా మంచి ఫలితం వస్తుంది అని నముతున్నా అక్టోబర్ 25న మీ ముందుకు వస్తున్న మా వనవాసం టీం కి మీ అందరి ఆశీర్వాదాలు కావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa