ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవును.... డాక్ట‌ర్ ప్రేమ‌లో ప‌డ్డానంటున్న నిఖిల్‌

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2019, 11:01 PM

 ’హ్యాపీడేస్‘, ’స్వామిరారా‘, కార్తికేయ సినిమాల స‌క్స‌స్‌ల‌తో హీరోగా నిల‌దొక్కుకున్న నిఖిల్  గత ఏడాది విడుదలైన  ’కిర్రాక్ పార్టీ‘ మంచి టాక్ అందుకుంది. ప్రస్తుతం ‘అర్జున్ సురవరం’ లో న‌టిస్తున్న నిఖిల్ ఇప్పుడు ప్రేమ‌లో ప‌డ్డాడ‌ట‌. ఈ విష‌యాన్ని  నిఖిల్ స్వయంగా చెప్పారు. తనను సదరు డాక్టర్ బాగా అర్థం చేసుకుందని,   ఫ్రెండ్స్ తో సరదా గడుపుతున్నప్పుడు కానీ ఆమె తనను డిస్టర్బ్ చేయదని,  ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుందన్న ఆలోచనతో ఆమె న‌న్ను ప్రోత్స‌హిస్తుంద‌ని అన్నారు. తనకు ప్రేమ పెళ్లిపై ఇష్టం ఏర్పడడానికి షారుఖ్ ఖాన్ సినిమాలే కారణమని స్ప‌ష్టం చేయ‌టంతో త్వ‌ర‌లో వీరి ప్రేమ పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa