ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“రణస్థలం” ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంత్రి స‌బిత‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2019, 02:10 AM

సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై రాజ్, షాలు హీరోహీరోయిన్లుగా ఆది అరవల దర్శకత్వంలో కావలిరాజు నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రణస్థలం”  ఫస్ట్ లుక్ ను  ఆదివారం  విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి  విడుద‌ల చేసారు.
ఈ సందర్భంగా మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ” ఈ సినిమా “మా ప్రాంతం వారు తీసినందుకు గర్వపడుతున్నాను.ప్రొడ్యూసర్ రాజు చిన్న స్టేజ్ నుండి ఈ రోజున సినిమాలు నిర్మించే స్థాయి కి ఎదగడం సంతోషం గా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
చిత్ర దర్శకుడు ఆది అరవల మాట్లాడుతూ ‘ఈ సినిమా కి కథే హీరో. మంచి కథతో ముందుకు వెళ్ళాం. చక్కటి అవుట్ ఫుట్ తో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
చిత్ర నిర్మాత కావాలి రాజు మాట్లాడుతూ’ మా సినిమా ఫస్ట్ లుక్ ను మంచి మనసున్న మా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు రిలీజ్ చేయడం ఆనందం గా ఉంది. ఈ సందర్భంగా మా సబితమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’అన్నారు. ఈ సినిమా ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా తెరకెక్కించాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఫైనల్ స్టేజ్ లో ఉంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa