ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ సినిమా పేరు అది కాదట....!

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2019, 01:01 PM

హీరో నితిన్ కొద్దినెలల క్రితం టాలెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చిత్రం చేయనున్నట్లు ప్రకటిచడం జరిగింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న చంద్రశేఖర్ ఏలేటి తీసింది తక్కువ చిత్రాలే అయినా, వైవిధ్యమైన చిత్రాలుగా మంచి పేరుతెచ్చుకున్నాయి. కాగా ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ కొద్దిరోజులుగా ఒక ప్రచారం మాధ్యమాలలో జోరుగా సాగుతుంది. ఈ చిత్రానికి చదరంగం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ వార్తలలో అసలు నిజం లేదని సమాచారం. చదరంగం అనే టైటిల్ దర్శక నిర్మాతల పరిగణలో లేదంట. ఓ వినూత్నమైన టైటిల్ ఆలోచిస్తున్న దర్శకుడు నవంబర్ లో ప్రకటిస్తారట. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. నితిన్ ఇప్పటికే బీష్మ, రంగ్ దే చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa