మ్యాంగొ తెలుగు మువీస్ పతాకం సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో దిల్ రాజు 96 వర్కింగ్ టైటిల్‌తో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టు నిర్మాతలు చెప్పారు. ఈ మేరకు ఫలింనగర్‌లో జరిగిన ఇందుకు సంబంధించిన వివరాలు అందిస్తూ, సమంతా, శర్వానంద్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలు జరుగుతున్నట్టుచెప్పారు. సంక్రాంతి బరిలో తమ చిత్రం ఉండబోతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి తదితరులు పాల్గొన్నారు.
కాగా ఇటీవల శర్వానంద్ కు షూటింగ్‌లో గాయం కావటం వల్లే సినిమా నిర్మాణంలో జాప్యం జరిగినట్టు ఫిలింనగర్ వర్గాల భోగట్టా. ఇక ఈ సినిమాకు యువతను క్యాచ్ చేసే టైటిల్ కొసం వెతుకులాట ఆరంభించినట్టు తెలియవచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa