పద్మావత్" లో ఖిల్జీ పాత్రతో జనాలను కట్టి పడేసిన సైఫ్ అలీ ఖాన్ మరోమారు నాగ సాధుగా చాలా విభిన్నమైన రూపంతో జనం ముందుకు రాబోతున్నాడు. ఇందుకు గానూ గతంలో రణవీర్ సింగ్ పాత్రని తీర్చి దిద్దిన దర్శన్ యెవాలేకర్ ఇప్పుడు ఈ నాగసాధు రూపాన్ని తీర్చి దిద్దారు. నవదీప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ ఒక నాగ సాధు పాత్రలో నటించాడు. ఈ పాత్రగురించి దర్శన్ చెపుతూ నాగ సాధు సాంఘిక జీవితాన్ని, వ్యక్తిగత ఆడంబరాలను త్యజించే వ్యక్తులు. ఆ సాధువులు వారు దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు, వారు తమ గురించి కూడా తాము పట్టించుకోరు. ఎప్పుడూ జుట్టు, గడ్డం కత్తిరించరు , ఎప్పుడూ బూడిద శరీరానికి పూసుకుని ఉండి, శివుడిలో ఐక్యమైపోయిన భావనలో ఉంటారు. కాబట్టి డ్రెడ్‌లాక్‌లు సహజమైనవి. వాటి నుంచే ప్రేరణ పొంది ఈ పాత్ర రూపొందించినట్టు చెప్పారు. సహజసిద్దమైన పాత్ర పోషిస్తుండటం పట్ల సైఫ్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa