ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రాజుగారి గది 3’ కి యూ/ఏ సర్టిఫికెట్...

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2019, 04:00 PM

‘రాజాగారు గది’ ప్రాంచైజీలో వస్తున్న మూడవ చిత్రం ‘రాజుగారి గది 3’. హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటించగా, ఓంకార్ దర్శకత్వంలో ఛోటా కె. నాయుడు కెమెరా సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కాగా హారర్ ఎంట‌ర్‌ టైన‌ర్ రాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫికెట్ ఫై తో ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. కాగా ఈ చిత్రంలో తక్కువ హర్రర్ ఎక్కువ కామెడీ ఉంటుందని తెలుస్తోంది. మొదటి రెండు భాగాలలో చేసిన అశ్విన్ బాబు మరో మారు రాజుగారి గది 3 లో హరోగా చేస్తుండగా, బ్రహ్మజీ, ఊర్వశి, ధన్రాజ్, అజయ్ ఘోష్, అలీ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి షబీర్ స్వరాలు అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa