అనసూయ భరద్వాజ్.. తన అందాలతో ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతి పోగొడుతూ ఉంటుంది. ఈ భామ జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. టాలీవుడ్ లో అనసూయ తెలియని వారు ఉండరు. ప్రస్తుతం అనసూయ 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో నటించింది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల అయ్యింది. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తరుణ్ భాస్కర్ హీరో అనగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ సినిమా నేను చేయడానికి ఇంకో కారణం కథ నన్ను బాగా ఎట్రాక్ట్ చేసింది. అందరికి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది, అందరిని ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం నాకు ఉంది అని అనసూయ చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa