కాజల్ అగర్వాల్ ఎమోషనల్ అయింది. అంతేకాదు ఆమె తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కాజల్ అగర్వాల్..తన చెల్లెలు నిషా అగర్వాల్‌కు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాజల్ నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు మరో బిడ్డకు జన్మించేంత వరకు నేను నిన్ను చూస్తేనే ఉన్నాను. నువ్వు మంచి అమ్మాయివి. నీవు కోరుకున్న జీవితం నీ సొంతం కావాలని కోరుకుంటున్నాను అంటూ చెల్లెలు నిషాతో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా కాజల్ గుర్తు చేసుకుంటూ ఒకింత ఎమోషనల్ అయింది. నిషా అగర్వాల్ విషయానికొస్తే.. అక్క కాజల్ అగర్వాల్ బాటలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ‘ఏమైంది ఈ వేళ, ‘సోలో’ చిత్రాల్లో నటించి మంచి విజయాలను అందుకున్న ఎందుకో అక్కలా చెల్లెలు నిషా అగర్వాల్‌కు అంతగా కలిసిరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa