సినీ నటుడు శ్రీకాంత్ చిన్న కొడుకు సినీ రంగ ప్రవేశం చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుదేవ, మమత మోహన్‌దాస్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రంలో శ్రీకాంత్ చిన్న కుమారుడు రోహన్ నటించనున్నట్లు సమాచారం. రోహన్ వయసు 10 సంవత్సరాలు. ఈ సినిమాలో ప్రభుదేవ, మమత మోహన్ దాస్ కొడుకుగా రోహన్ నటించనున్నాడు. హారర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తన తొలి సినిమాపై రోహన్ మాట్లాడుతూ.. తనకెంతో ఆనందంగా ఉందని.. తన తండ్రి సినిమాలు షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలాసార్లు సెట్స్‌కు వెళ్లానని.. అప్పటి నుంచి నటనపై ఆసక్తి పెరిగిందని చెప్పాడు. ఈ చిత్రంలో తాను దెయ్యంతో బాధింపబడే వ్యక్తిగా నటిస్తున్నానని రోహన్ తెలిపాడు. శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ కూడా ఇప్పటికే ‘నిర్మలా కాన్వెంట్’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa