ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ .. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే రొమాంటిక్ డ్రామా చిత్రం చేస్తున్నాడు. తన తొమ్మిదవ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు . ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్,ఇజబెల్లా, క్యాథరిన్ థెస్రా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అధికభాగం పారిస్‌లో షూట్ చేశారు. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ గడ్డం పెంచుకుని హార్ట్ బ్రేక్ అయిన ఒక ఫెయిల్యూర్ లవర్‌లా కనిపిస్తున్నాడు. ఈ మూవీని వేలంటైన్స్ డే గిఫ్ట్ గా ఫిబ్రవరి 14,2020న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa