వెరోనిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఆరాధన ఆర్ఫానైజ్ హోత్‌తో కలిసి న్యూ ఇయర్ హాలీడేస్‌లో ఈవెంట్స్ ప్లాన్ చేస్తోంది. మొదటిసారి నార్త్ అమెరికాలో జరుగబోతున్న ఈ ఈవెంట్‌లో దాదాపు 30 మంది టాలీవుడ్ సెలెబ్రిటీస్ పాల్గొంటారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటులు శివబాలాజీ, సంపూర్ణేష్‌బాబు, ధన్‌రాజ్, అర్చన, వెరోనిక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతినిధులు ఈ వివరాలను వెల్లడించారు. 34 గంటలు లైవ్ పర్ఫార్మెన్స్ ఉండనున్న ఈ ఈవెంట్ అమెరికాలో నాలుగు నగరాలలో జరుగనుంది. సినీ ప్రముఖులతో ఫోటోలు దిగే అవకాశం ఈ ఈవెంట్‌లో దొరుకుతుంది. మ్యూజిక్ డైరెక్టర్లు, గాయకులు, హీరోలు, హీరోయిన్లు, కమేడియన్లు వారి సొంత కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. డిసెంబర్ 31న రాత్రి చికాగో, ఇల్లినాయిస్‌లోఈ ఈవెంట్ ఉండబోతోంది. వెరోనిక ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్ నైన్ ఈవెంట్స్ కలసి ఈ ఈవెంట్ చేయనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa