పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమ సక్సెస్‌తో రామ్ ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. ఈ ఊపులోనే తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా సూపర్ హిట్టైన ‘తడమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాను రామ్ సొంత ప్రొడక్షన్స్‌లో స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ‘తడమ్’లో అరుణ్ విజయ్ డబుల్ రోల్లో యాక్ట్ చేసాడు. ఈ సినిమ రీమేక్‌లో రామ్ ఫస్ట్ టైమ్ డబుల్ రోల్లో యాక్ట్ చేయనున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ డబుల్ దిమాక్ పాత్రలో మెప్పించిన రామ్ పోతినేని... ఇపుడు చేయబోతున్న ‘తడమ్’ రీమేక్‌లో డబుల్ రోల్లో రామ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa