కొంతకాలం క్రితమే గోపీచంద్ రెండు సినిమాలు చేయడానికి అంగీకరించాడు. భోగవిల్లి ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడితో ఆయన ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో భోగవిల్లి ప్రసాద్ నిర్మించనున్న సినిమా రద్దు అయినట్టుగా తెలుస్తోంది. ఇటీవల గోపీచంద్ నుంచి వచ్చిన 'చాణక్య' భారీ పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఆ సినిమా నిర్మాత నష్టాలపాలయ్యారు. ఈ ప్రభావం కారణంగానే, గోపీచంద్ తో చేయాలనుకున్న ప్రాజెక్టును భోగవిల్లి ప్రసాద్ రద్దు చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు గోపీచంద్ చేతిలో సంపత్ నంది సినిమా మాత్రమే వుంది. అది కూడా భారీ బడ్జెట్ తో కూడినదే. ఈ నేపథ్యంలో ఏ తరహా కథలను తన నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్నారనే విషయంపైనే గోపీచంద్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa