"ఛలో" సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందాన. ఈ భామ రెమ్యూనరేషన్ పై పుకార్లు గత కొంత కాలంగా చికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినా.. ఇప్పుడు మళ్లీ అదే రూమర్ షికారు చేస్తోంది. ఇటీవల చైతూ జోడీగా చేయమని అడిగితే, ఆయనకంటే పారితోషికం ఎక్కువగా అడిగిందనే ప్రచారం జోరందుకుంది. 'మజిలీ' తరువాత చైతూ ఒక్కో సినిమాకి 4 నుంచి 5 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. పూజా హెగ్డే వంటి హీరోయిన్ కే అందులో సగం ఇస్తున్నారు. అందువలన చైతూ కంటే ఎక్కువ పారితోషికాన్ని రష్మిక అడిగే అవకాశం లేదనీ, ఇదంతా ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమనేది సన్నిహితుల మాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa