సీనియర్ హీరో రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రవితేజ మరో సినిమాను ప్రారంభిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను దీపావళి సందర్భంగా ఇచ్చారు చిత్రయూనిట్. రవితేజ 66వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. గతంలో రవితేజ హీరోగా డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాతో రవితేజతో కలిసి హ్యాట్రిక్ సక్సెస్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. పండగ చేస్కో, విన్నర్ సినిమాలతో నిరాశపరిచిన గోపిచంద్, రవితేజతో కలిసి హిట్ ట్రాక్‌లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు.ప్రస్తుతం గోపిచంద్ మలినేని ఈ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రవితేజ కోసం పవర్‌ఫుల్ పోలీస్ కథను సిద్ధం చేస్తున్నాడు గోపిచంద్. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నారు చిత్రయూనిట్. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్రయూనిట్. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa