ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి తండ్రి అయిన ‘కె.జి.ఎఫ్’ హీరో...

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2019, 03:55 PM

‘కె.జి.ఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో యాష్ మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి, నటి రాధిక పండిట్ ఈరోజు బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు యాష్, రాధికలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతేడాది డిసెంబర్లోనే యాష్, రాధికలకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ పాప వయసు 10 నెలలు మాత్రమే. ఇకపోతే ప్రస్తుతం యాష్ ‘కె.జి.ఎఫ్-2’లో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది విడుదలకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa