సుజన్, తనిష్క్ జంటగా నటిస్తున్న చిత్రం అపప్పుడు-ఇప్పుడు. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్యపాత్రధారులు. చలపతి పువ్వుల దర్శకత్వంలో ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. తాజాగా కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా ఈ సినిమా తొలిపాట విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్ గుడ్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు-ఇప్పుడు చిత్రం ఆ తరహానే. నవతరం నటీనటులు రాణించాలి. నా చేతుల మీదుగా విడుదలైన పాట బాణీ, సంగీతం ఆకట్టుకుంది. సినిమా ఘనవిజయం సాధించాలి అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa