ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేణు శ్రీరామ్ ఇరుక్కున్నాడే..!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2019, 12:21 PM

అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా సెట్స్ మీదకెళ్ళిపోతాడననుకున్నారు. వేణు శ్రీ రామ్ చెప్పిన కథకి అల్లు అర్జున్ ఇంప్రెస్స్ అవడమే కాదు.... ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఎప్పుడో బయటికొచ్చేసింది. అయితే సుకుమార్ సినిమాని పక్కన బెట్టి అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ ఐకాన్ మొదలెడతాడు అనుకుంటున్న టైం లో... అందరికి షాకిస్తూ సుకుమార్ సినిమాని ఈ రోజు మొదలుబెట్టబోతున్నాడు అల్లు అర్జున్. ఇక వేణు శ్రీరామ్ తో చెయ్యాల్సిన ఐకాన్ అటకెక్కిందనే న్యూస్ మొదలైంది. ముందుగా వేణు శ్రీరామ్ లైన్ చెప్పినప్పుడు ఓకేనన్న అల్లు అర్జున్... పూర్తి కథను చెప్పిన తరువాత అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందనటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa