రవితేజ తాజా చిత్రంగా 'డిస్కోరాజా' రూపొందుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ .. నభా నటేశ్ .. తాన్యా హోప్ నటిస్తున్నారు. 15 నుంచి 17 కోట్లలో ఈ సినిమాను పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారట. అయితే ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 22 కోట్లు దాటిపోయినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాలు .. పాటలు .. ఇతరత్రా ఖర్చులు చూసుకుంటే 30 కోట్ల వరకూ కావొచ్చని అంటున్నారు. ఈ విషయంపైనే నిర్మాతలు టెన్షన్ పడుతున్నారని చెప్పుకుంటున్నారు. ముగ్గురు ముద్దుగుమ్మలతో తెరపై రవితేజ చేసే సందడి, పెట్టుబడిని పట్టుకొచ్చేస్తుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa