సూపర్ స్టార్ రజిని కాంత్ ఓ అరుదైన గౌరవం అందుకోనున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా(ఐ ఎఫ్ ఎఫ్ ఐ) 50వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ ఆయనను స్పెషల్ ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు తో సత్కరించనుంది. ఈమేరకు కేంద్ర ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్ క్యాస్టింగ్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఈనెల 20 నుండి 28వరకు జరగనున్న ఈ వేడుకలో ఆయనను ఈ అవార్డుతో సత్కరించనున్నారు. అలాగే ఫ్రెంచ్ నటి ఇసబెల్లా హుప్పర్ట్ కి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఇక ప్రస్తుతం రజని నటిస్తున్న దర్బార్ మూవీ నిర్మాణంత కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుందని సమాచారం. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 15న విడుదల కానుంది. కాగా ఆయన తన తదుపరి చిత్రంగా శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ లో చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa