ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతున్న ‘కాంచన3’ చిత్రీకరణ

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 09:04 AM

ముని’ చిత్రంతో హర్రర్‌ బాటలో అడుగుపెట్టిన రాఘవ లారెన్స్‌ ప్రస్తుతం వరుస హిట్లతో విజృంభిస్తున్నారు. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పటి వరకు మూడు సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నారు. రెండో సీక్వెల్‌ ‘కాంచన’గా, ఆ తర్వాత చిత్రం ‘కాంచన 2’గా వచ్చింది. ఇప్పుడు ‘కాంచన 3’ తెరకెక్కుతోంది. దీన్నే ‘ముని 4’గా కూడా చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఓవియా కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో ఓవియా ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వినిపించాయి. అందులో ఎలాంటి నిజం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం లారెన్స్‌, ఓవియాకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించామని పేర్కొంటున్నాయి. ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న ఓవియాకు ఈ సినిమా మరో బ్రేక్‌ ఇస్తుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa