అందం ఉంది.. అభినయం ఉంది కానీ అదృష్టమే లేక అక్కడే ఆగిపోయింది రెజీనా. ఈమె తర్వాత వచ్చినోళ్లు.. ఈమెతో వచ్చినోళ్లంతా స్టార్ హీరోయిన్లు అయితే రెజీనా మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. దాంతో అందాల ఆరబోతకు తెరతీసింది ఈ ముద్దుగుమ్మ. అందుకే బయటికి ఎక్కడికి వచ్చినా.. ఏ మాత్రం అందాలు దాచుకోవడం లేదు. ఎండలో ఒడియాలు ఆరబోసినట్లు.. కెమెరాలకు అందాలు ఆరబోస్తుంది. ఈ మధ్య ఎక్కడికి వచ్చినా అందాలను కెమెరాలకు పూర్తిగా అరువిచ్చేస్తుంది రెజీనా.
ఇక ఇప్పుడు కృష్ణవంశీ సినిమా నక్షత్రం కోసం మరోసారి రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో బికినీ కూడా వేసుకుందని తెలుస్తోంది. ఇప్పుడు విడుదలైన పాటల్లో అయితే అమ్మాయిగారు రెచ్చిపోయిన తీరుకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అసలే హీరోయిన్ల అందాల్ని చూపించడంలో కృష్ణవంశీ కెమెరా కన్ను ఓ అడుగు ముందే ఉంటుంది. దానికి తగ్గట్లే రెజీనా అందాల్ని అదిరిపోయేలా చూపించాడు ఈ దర్శకుడు. తాజాగా విడుదలైన నక్షత్రం ట్రైలర్.. పాటల్లో రెజీనా ఎంత హాట్ గా ఉండబోతుందో అర్థమైపోతుంది. మొత్తానికి మునిగిపోతున్న కెరీర్ నావను ఒడ్డుకు చేర్చుకోడానికి అవసరమైన ప్రతీ ఆయుధాన్ని వాడేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ గ్లామర్ షో అయినా రెజీనా కెరీర్ ను దారికి తీసుకొస్తుందో లేదో చూడాలి..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa