నాని, సాయి పల్లవి ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం ఎంసీఏ ( మిడిల్ క్లాస్ అబ్బాయి). డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. వదిన, మరిదిల మధ్య ఆసక్తికర సన్నివేశాలతో చిత్రం రూపొందిందని ట్రైలర్ ని బట్టి తెలుస్తుంది. భూమిక ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ట్రైలర్ లో డైలాగ్స్ మాత్రం మూవీ పై భారీ అంచనాలే పెంచాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. డిసెంబర్ 16న చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకి ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa