గత కొన్నేళ్లుగా వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. ఈ యేడాది ‘ఎఫ్ 2’ సినిమాతో వరుణ్ తేజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్.. తాజాగా తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ రైతు పాత్రలో నటిస్తే.. నాగ చైతన్య.. జవాన్ పాత్రలో నటిస్తున్నాడు. జై జవాన్..జై కిసాన్ నేపథ్యంలో దర్శకుడు బాబీ (కే.యస్.రవీంద్ర) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నిజ జీవితంలో మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య ఇప్పుడు స్క్రీన్ పై కూడా అలాగే నటిస్తున్నారు. టైటిల్ కూడా పాజిటివ్‌గా ఉండటంతో ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ తెరకెక్కించిన ‘వెంకీ మామ’ చిత్రం కోసం అటు దగ్గుపాటి.. ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో వెంకటేష్..నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ఇపుడు పూర్తి స్థాయిలో వీళ్లిద్దరు కలిసి ఈ చిత్రంలో నటించారు. ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనకున్నారు. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంలో డిసెంబర్ 20న రిలీజ్ చేయాలన్నారు. ఆ డేట్‌లో కూడా మూడు సినిమాలు పోటీకి ఉండటంతో తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. ఈ విషయాన్ని రానా, దర్శకుడు బాబీ కన్ఫామ్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa