యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'జాన్'. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. 1970 పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలో నటించబోతుందని తాజా సమాచారం. ఇంతకుముందు 'మిస్టర్ పర్‌ఫెక్ట్' (2011) సినిమాలో ప్రభాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa