సాయితేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వం నిర్మిస్తున్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. డిసెంబర్ 4న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లుగా దర్శకుడు మారుతి తెలిపారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుందీ చిత్రం. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు, ప్రతి ఒక్కరూ హాయిగా ఎంజాయ్ చేసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు మారుతి తెలిపారు. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలకపాత్రను పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa