ట్రెండింగ్
Epaper    English    தமிழ்

`చూసీచూడంగానే` ట్రైలర్‌ రీలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2019, 08:24 PM

`చూసీచూడంగానే`  మూవీ ట్రైలర్‌ రీలీజ్ చేసారు.  శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `చూసీ చూడంగానే`. ఈ చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల ఘనతను చాటిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు `పెళ్ళిచూపులు`, `మెంటల్ మదిలో`లను నిర్మించిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి.. తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ కందుకూరి గత చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అసోసియేషన్‌లో విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత డి.సురేశ్‌బాబు, దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి `మెంటల్ మదిలో` కెమెరా మెన్ వేద రామన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. డిసెంబర్ నెల చివరి వారంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa