అజ్ఞాతవాసి సినిమాలో పవన్ నట విశ్వరూపాన్ని చూస్తారు’అన్నారు త్రివిక్రమ్. ఈ ఆడియో వేడుకలో మాట్లాడిన త్రివిక్రమ్.. అజ్ఞాతవాసి సినిమా వెనుక ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అలాంటి మహానుభావుల్లో కొందరు ఈ వేదిక మీద వున్నారు. మణికంఠన్, ప్రకాష్, అనిరుధ్, బొమ్మన్ ఇరానీ, తనికెళ్ల భరణి ఇలా అందరికీ నా కృతజ్ఞతలు. వీళ్ల అందరి దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను.
ఈ సినిమాకు నిర్మాత చినబాబు, ఆయన పక్కన వంశీ, పిడివి ప్రసాద్ కలిసి బోలెడు ఖర్చు చేసారు. పవన్ కళ్యాణ్ ఇటలీలో వుండగా రెండు నిమషాల్లో, ఫోన్ లో కథ చెప్పాను. ఆయన వెంటనే ఓకె చేసారు. ఆ తరువాత నేనేం చెబితే అది చేసారు. అంతే తప్ప ఏమీ అడగలేదు.ఈ సినిమాలో పవన్ నట విశ్వరూపాన్ని చూస్తారు. అంతకన్నా ఆయన గురించి ఇంకేం చెప్పకూడదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa