బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల భామ జెనీలియా. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకున్న తర్వాత ఈ భామ సినిమాలకు కాస్త దూరంగా ఉంది. ఈ జంటకు రియాన్, రహిల్ అనే చిన్నారులు జన్మించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 3, 2012న జెనీలియా.. రితేశ్ తో కలిసి ఏడడుగులు వేసింది. వీరి పెళ్లి ప్రయాణం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లైఫ్‌లో ప్రతి మూమెంట్‌ని ఫుల్ హ్యపీగా ఎంజాయ్ చేస్తుంది ఈ జంట. అయితే డిసెంబర్ 17న రితేష్ 40వ పడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా జెనీలియా తన భర్తకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. టెస్లా మోడల్ X కారును తన భర్తకి బహుమతిగా ఇచ్చిందట జెన్నీ. ఇది అత్యంత ఖరీదైన కారు మాత్రమే కాదు.. ఇండియాలో ఇలాంటి కారును కలిగిన వారిలో రితీశ్ రెండో వ్యక్తి మాత్రమే. తన భార్య ఇచ్చిన బహుమతికి మురిసిపోయిన రితేష్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. నా భార్య ఇచ్చిన గిఫ్ట్ నా వయసును సగానికి సగం తగ్గించేసిందని, 20 యేళ్ల కుర్రాడిని చేసేసిందని అంటూ రితీశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa