ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గెస్ట్ రోల్ లో సమంత

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2019, 06:36 PM

వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో 'వెంకీమామ' సినిమా రూపొందింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో, వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటించారు. ఈ సినిమాలో సమంత మెరవనుందనేది తాజా సమాచారం.
ఈ సినిమాలో అతిథి పాత్రలో సమంత కనిపించనుందని అంటున్నారు. కథలో అతిథి పాత్ర కీలకం కావడం వలన, సమంత అయితే కథా పరంగాను .. క్రేజ్ పరంగాను కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారట. అయితే కావాలనే ఈ విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా వుంచారట. ఇక ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ వార్తను బయటికి వదిలినట్టుగా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa