చిత్ర రంగంలో దాదాపు దశాబ్దం న్నర నట ప్రయా ణంలో ఎన్నో విజయాలు అందుకుంది ఇలియానా. అందుబాటులో ఉన్న అన్ని పరిశ్రమల్లో నాయికలు తిరగడం అలవాటే. ఇలియానా ఇలాగే ప్రయాణం చేసింది. ఐదారేళ్లు దక్షిణాదిలో అగ్ర తారగా వెలిగింది. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి తన అదృష్టాన్ని కొనసాగించింది. బర్ఫీ, రుస్తుం లాంటి చిత్రాలతో పేరున్న నాయిక అయ్యింది. ప్రతి పరిశ్రమలో విజయాలు అందుకుంది. ఇటీవలే పాగల్ పంటీ చిత్రంతో ప్రేక్షకులను నవ్వించింది ఇలియానా. ఈ సినిమాతో ఇలియానా వినోద ప్రధాన పాత్రల్లోనూ మెప్పించగలదని చూపించింది. పాగల్ పంటీ బాక్సాఫీస్ ఫలితం మిశ్రమంగా ఉన్నా….సినిమాకు వసూళ్లు బాగానే దక్కాయి. నటిగా తనకు సంతృప్తినిచ్చిన చిత్రంగా ఈ భామ చెప్పుకుంది. ఇక తన నట ప్రయాణం గురించి మాట్లాడుతూ….నాయికగా గొప్ప శిఖరాలు చేరుకోవాలని ఆశలు పెట్టుకోలేదు. మరో ఐదేళ్ల తర్వాత ఈ స్థాయిలో ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి లక్ష్యాలు లేవు కాబట్టే….ప్రశాంతంగా సినిమాలు చేస్తూ వచ్చాను. లేకుంటే అనుకున్నది సాధించలేదనే నిరాశ నన్ను వెంటాడేది. ఈ క్రమంలో కొన్ని అద్భుతమైన పాత్రలు చేసే అవకాశం దక్కింది. అందుకే సినిమాల విషయంలో తొందరపడను. వచ్చినవన్నీ చేసుకుంటే వెళ్లే అలవాటు నాకు లేదు. ఆలస్యమైనా మంచి సినిమాలు చేయాలనుకుంటాను. తెలుగులోనూ మళ్లి నటించేందుకు సిద్ధంగా ఉన్నా. అని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa