టీమిండియా క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు-టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కాగా రిసెస్ఫన్ కార్యక్రమం శంషాబాద్ లోని పోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కి తెలంగాణ సిఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అలాగే టాలీవుడ్ నుంచి మెగా దంపతులు రామ్ చరణ్- ఉపాసన హాజరయ్యారు. ఈ సందర్భంగా అజహరుద్దీన్.. సానియా.. చెర్రీ.. ఉపాసనలు ఎంతో హుషారుగా కలిసి మాట్లాడుకుంటోన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రామ్ చరణ్..సానియా చాలా కాలంగా మంచి స్నేహితులు. ఉపాసనతోనూ సానియా ఎంతో క్లోజ్. ఆ ఆప్యాయత .. స్నేహానుబంధం ఈ రిసెప్షన్ లో కనిపించింది. ఇక ఈవెంట్ ఆద్యంతం మెగా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పెళ్లి వేడుకలో రామ్ చరణ్ కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. మీసాలు.. గడ్డం ట్రిమ్ చేసి యూత్ ఫుల్ గా కనిపించారు. అల్లూరి సీతారామ రాజు పాత్రకు సంబంధించి కొంత షూటింగ్ పార్ట్ పూర్తయిన నేపథ్యంలో చరణ్ మీసాలు..గడ్డం ట్రిమ్ చేసారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa