కన్నడలో సూపర్ హిట్ సాధించి ఆ తర్వాత తెలుగులోను తెరకెక్కి మంచి విజయం సాధించిన చిత్రం యూ టర్న్. పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీకి మంచి ఆదరణ లభించడంతో హిందీలోను రీమేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో తాప్సీని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు గాసిప్ రాయుళ్ళు ప్రచారం చేశారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన తాప్సీ.. నేను ఏ రీమేక్ చిత్రం చేయడం లేదు. నన్ను ఎవరు సంప్రదించలేదు. ఒకవేళ ఆ సినిమా చేయాలని నాకు ఆఫర్ వచ్చిన, నేను చేయను అని కుండబద్దలు కొట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa